పువ్వుల పరదా

Fish n baloon

Courtesy: FreeDigitalphotos.net

ఏదో చెప్పాలనుంది

పెదాలు పలకటంలేదు

ఏదో వ్రాయలనుంది

పదాలు పెగలటంలేదు

 

మహాకవి అన్నట్లు

“ గగనమంతా నిండి

బహుళ పంచమి జ్యోత్స్న”

భయపెడ్తుందా నన్ను?

 

ఏదో చూడాలని

ఎక్కడెక్కడికో వెళ్లాలని ….. కాని…?

దూరాలు తీరాలు భారమై

కుంగిన క్షణం

 

నింగి నిం డిన

చీకటి భూతం

భయపెడ్తుందా నన్ను?

 

ఏది ఏమైనా 

భయం పైన పువ్వుల పరదా పరచి

నా హృదయ గర్భం లోకి పిలుస్తున్నా మిమ్మల్ని

About saltnpepperdays

I am an EFL/ESL teacher from India. I am interested in teaching/learning to teach English. Photography and reading are my hobbies.
This entry was posted in కవితలు, తెలుగు. Bookmark the permalink.

Leave a comment